‘మణికర్ణిక’నూ తీసుకు వచ్చిన క్రిష్‌

Manikarnika First Look

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్‌ గత సంవత్సరం బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో బాలీవుడ్‌ నుండి క్రిష్‌కు ఛాన్స్‌ దక్కింది. స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ హీరోయిన్‌గా ‘మణికర్ణిక’ చిత్రంను తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు. విజయేంద్ర ప్రసాద్‌ స్టోరీ అందించిన ఆ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన వర్క్‌ జరుగుతుంది. వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల కాబోతున్న మణికర్ణిక చిత్రం ఫస్ట్‌లుక్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేయడం జరిగింది.

Manikarnika

వీరనారి, గుర్రపు స్వారీ చేస్తూ వెనుక పసి బిడ్డను కట్టుకుని యుద్ద రంగంలో కదం తొక్కుతూ ముందుకు సాగుతున్న పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ‘మణికర్ణిక’ చిత్రం ఖచ్చితంగా క్రిష్‌కు బాలీవుడ్‌లో మరో మెట్టు పైకి ఎదిగేలా ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. క్రిష్‌ దర్శకత్వంలో తెలుగులో రూపొందుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయడం జరిగింది. బాలకృష్ణను అచ్చు ఎన్టీఆర్‌లా మార్చేసిన క్రిష్‌ ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా రెండు ఫస్ట్‌లుక్‌లను దర్శకుడు విడుదల చేయడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రెండు కూడా ప్రతిష్టాత్మక చిత్రాలే అవ్వడం మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

krish jagarlamudi 2 New movie posters release