సతీష్‌ను వదలని దిల్‌రాజు

Dil Raju Produce Another Film in Satish vegnesha Direction

టాలీవుడ్‌ స్టార్‌ నిర్మాత దిల్‌రాజు ఒక దర్శకుడిని పట్టుకున్నాడు అంటే అతడిని అంత సులభంగా వదిలి పెట్టడు. ఎంతో మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత దిల్‌రాజు తనతో వర్క్‌ చేసి సక్సెస్‌లను దక్కించుకున్న నిర్మాతలతో వరుసగా సినిమాలకు ఒప్పందం చేసుకుంటూ ఉంటాడు. తాజాగా సతీష్‌ వేగేశ్నతో కూడా ఇలాంటి ఒప్పందంనే నిర్మాత దిల్‌రాజు చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. దిల్‌రాజు ఇప్పటికే సతీష్‌ వేగేశ్నతో రెండు చిత్రాలను నిర్మించాడు. మొదటిది ‘శతమానంభవతి’ కాగా రెండవది ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ రెండు చిత్రాల్లో మొదటి సినిమా సూపర్‌ హిట్‌ అవ్వగా, రెండవ సినిమా యావరేజ్‌ టాక్‌ను దక్కించుకుంది. ఇప్పుడు వీరి కాంబోలో మూవడ సినిమాకు ఏర్పాట్లు అప్పుడే జరుగుతున్నాయి.

Shatamanam Bhavati,srinivasa kalyanam

సతీష్‌ వేగేశ్నతో ఇప్పటి వరకు రెండు ఫ్యామిలీ ఓరియంటెడ్‌ చిత్రాలను నిర్మించిన దిల్‌రాజు ప్రస్తుతం మూడవ సినిమా ‘థ్యాంక్యూ’ అనే టైటిల్‌తో నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. తాజాగా ఆ సినిమాను నిర్మాత ప్రకటించాడు కూడా, ఈమద్య ఒక రచయిత చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చడంతో వెంటనే ఆ కథను సతీష్‌కు చెప్పాను అని, ఆయనకు బాగా నచ్చి తప్పకుండా చేద్దాం అన్నాడు. ఈ సినిమాకు థ్యాంక్యూ అనే టైటిల్‌ బాగుంటుందని రిజిస్ట్రర్‌ చేయించాను. ఈ సంవత్సరం చివర్లో సినిమాను ప్రారంభించి, వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి విడుదల చేస్తామంటూ దిల్‌రాజు ప్రకటించడం జరిగింది. శ్రీనివాస కళ్యాణం సినిమా యావరేజ్‌ టాక్‌ను దక్కించుకున్నా కూడా వెంటనే సతీష్‌తో మరో సినిమాను నిర్మించేందుకు దిల్‌రాజు ముందుకు రావడం కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. చిన్న బడ్జెట్‌తో చిన్న హీరోతో దిల్‌రాజు ‘థ్యాంక్యూ’ చెప్పించే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.