గీత గోవిందం రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

geetha-govindam--Review

నటీనటులు: విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న,నాగేంద్ర బాబు,సుబ్బరాజు,వెన్నెల కిషోర్,సత్యం రాజేష్,గిరిబాబు,అన్నపూర్ణ

దర్శకుడు:  ప‌రుశురామ్‌

నిర్మాత: బ‌న్నీ వాసు

సినిమాటోగ్రఫీ: మ‌ణికంద‌న్‌

సంగీతం: గోపీ సుంద‌ర్‌

geetha-govindam

అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ బ్లాక్‌బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమాను ఎంచుకుంటాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా విజయ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకి స్పెషలిస్ట్ అయినా పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం పేరుతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ దేవరకొండ వలన, రిలీజ్ కి ముందు వచ్చిన ఇంకేం ఇంకేం సాంగ్ వల్లా ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీత గోవిందం ప్రేక్షకులకు అంచనాలను చేరుకుందా? లేదా తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

కథ : 

geetha-govindam.

గోవిందం (విజయ్ దేవరకొండ) ఒక కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటాడు. కాబోయే భార్య గురించి తనకంటూ కొన్ని అంచనాలు వుంటాయి. తన కలల రాకుమారి గీత (రష్మిక మంథాన) ఒక గుడిలో తారసపడుతుంది. తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడిపోయిన గోవింద్ అనుకోకుండా ఒకసారి ఆమెతో కలిసి బస్సులో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఒక బలహీన క్షణంలో ఆమెకు లిప్ లాక్ ఇస్తాడు ఈ ఘటన ఇద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీస్తుంది. విజయ్ క్యారెక్టర్‌ను తప్పుగా అర్థం చేసుకున్న గీత ఏం చేసింది? వారిద్దరి ప్రేమ ఎలా ఫలించింది? విజయ్ గీతను ఎలా కన్వీన్స్ చేశాడు? వాళ్లిద్దరూ ఎలా ఒక్కటయ్యారు అనేది మిగతా కథ.

ఎవరెలా చేసారంటే…

geetha1
సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందు దర్శకుడు గురించే చెప్పుకోవాలి, సినిమాని పూర్తి వినోదాత్మకంగా భావోద్వేగాల సమహారంతో అందంగా మలవడంలో సఫలీకృతం అయ్యారు. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా పరశురామ్ స్క్రీన్‌ప్లేను రూపొందించాడు. ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాయి. తొలిభాగంలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో, రెండోహాఫ్‌ను ఎమోషన్స్‌తో చక్కగా తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా వున్నాయి.
allu-arivindh
ఈ చిత్ర ట్రైలర్ లో నేను మారిపోయాను ఐయామ్ కంప్లీట్ డీసెంట్ నౌ అని విజయ్ చెప్పే డైలాగ్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రంలో పాత్ర పరంగా చాలా కొత్త విజయ్‌ను చూస్తారు. అమ్మాయిలంటే గౌరవం వున్న వ్యక్తిగా, భార్య అంటే మంచి అభిప్రాయం వున్న గోవింద్‌గా ఆకట్టుకుంటాడు. ఈ సినిమాతో విజయ్ ఫ్యామిలీ ప్రేక్షకుల హీరోగా నిలిచిపోతాడు. ఛలో తర్వాత రష్మిక మరోసారి ఈ చిత్రంతో ఆకట్టుకుంది. విజయ్‌తో పోటా పోటీగా నటించింది. క్యూట్ డైలాగ్‌లతో, ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్ గుండె కోసేస్తోంది. రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ పాత్రలు కావాల్సినంత వినోదాన్ని అందించాయి. నాగబాబు, సుబ్బరాజు, ఇతర పాత్రలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం, ఫోటోగ్రఫీ, సినిమాకి వున్న పెద్ద అసెట్. ఇక నిత్యామీనన్, అనూ ఇమ్మాన్యూయల్ అతిథి పాత్రలు బోనస్ లా అనిపిస్తాయి.
Producer Allu Aravind The Last Minute Geetha Govindham Movie Sold In Some Areas
తెలుగు బుల్లెట్ రేటింగ్: 3/5
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్: గీత కోసమే మారిన గోవిందం