కేరాఫ్ కంచరపాలెం ట్రైలర్… పెళ్లి గోల

c-o-kancharapalem-trailer

దగ్గుబాటి రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స నిర్మిస్తున్న సినిమా కేరాఫ్ ‘కంచరపాలెం’. వెంకటేష్ మహా అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్‌ అగస్థి సంగీతం అందిస్తున్నారు. న్యూయార్క్‌ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా కావడం సినిమా మీద మరింత అంచనాలు పెంచేస్తోంది వైజాగ్‌ దగ్గరలో ఉన్న కంచెర‌పాలెం నేప‌థ్యంలో సాగే భిన్న‌మైన ప్రేమ‌క‌థగా ఈ సినిమా సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ‘కంచరపాలెం’ సినిమాను సమర్పిస్తుండటం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా ఓ గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని నమ్ముతున్నా. ఈ ఏడాది రాబోతున్న అతి పెద్ద చిన్న సినిమా ఇది’అంటూ రానా ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. మీరూ ట్రైలర్ మీద ఒక లుక్ వెసెయ్యండి మరి

kancharapalem