అఖిల్‌ 3వ హీరోయిన్‌ ఈమే..!

Akhil 3rd Movie Heroine is Rashi Khanna

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా మూడవ సినిమా తాజాగా ప్రారంభం అయ్యింది. ‘తొలిప్రేమ’తో ఒక బ్యూటీఫుల్‌ సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా రాశిఖన్నాను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిల్‌ మొదటి రెండు చిత్రాల్లో కూడా కొత్త హీరోయిన్స్‌తో నటించాడు. మొదటి సినిమా ‘అఖిల్‌’లో సాహేషా సైగల్‌, రెండవ సినిమా ‘హలో’లో కళ్యాణి ప్రియదర్శి నటించిన విషయం తెల్సిందే. మొదటి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డ నేపథ్యంలో సెంటిమెంట్‌గా మూడవ సినిమాలో కొత్త హీరోయిన్‌కు బదులు ఇప్పటికే స్టార్‌డం సంపాదించిన హీరోయిన్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘తొలిప్రేమ’ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్‌గా నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలో రాశిఖన్నా అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకుంది. ఇక అఖిల్‌కు జోడీగా రాశిఖన్నా బాగుంటుందనే అభిప్రాయంకు తాజాగా దర్శకుడు వచ్చాడు. అందుకు నాగార్జున కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆమె ఎంపిక విషయం అధికారికంగా మిగిలి ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కెరీర్‌ ఆరంభంలో చాలా లావుగా కనిపించిన రాశిఖన్నా ఈమద్య చాలా బరువు తగ్గింది. దాంతో అఖిల్‌కు జోడీగా నటించే అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక అఖిల్‌ కోసం పూజా హెగ్డేతో పాటు, అమైరా దస్తూర్‌లను కూడా పరిశీలించినట్లుగా సమాచారం అందుతుంది. కాని వారికంటే రాశిఖన్నాకే ఎక్కువ మార్కులు పడ్డాయి.