న్యూలుక్‌… ప్రభాస్‌ల అనిపిస్తున్నాడు!

NKR 16 First Look

నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ వరుసగా ఫ్లాప్‌లు వస్తున్నా కూడా, వరుసగా చిత్రాలను చేయడంను మాత్రం మానడం లేదు. వరుసగా ఫ్లాప్‌ చిత్రాలు చేస్తూ ఉన్న కళ్యాణ్‌ రామ్‌ తాజాగా తన 16వ చిత్రంను చేస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ గుహన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవలే వచ్చిన ‘ఎమ్మెల్యే’ మరియు ‘నా నువ్వే’ చిత్రాల్లో చాలా విభిన్నంగా కొత్తగా కనిపించిన కళ్యాణ్‌ రామ్‌ తాజాగా ఈ చిత్రంలో కూడా కొత్త లుక్‌తో అలరించేందుకు సిద్దం అయ్యాడు. నా నువ్వే చిత్రంలో తమన్నాకు ఏమాత్రం తగ్గకుండా, హ్యాండ్సమ్‌గా కనిపించడంతో పాటు, లవర్‌బాయ్‌గా తన లుక్‌తో మెప్పించిన కళ్యాణ్‌ రామ్‌ సినిమా ఫ్లాప్‌ అయినా మంచి మార్కులు అయితే పొందాడు. ఇప్పుడు అదే తరహాలో తాజాగా నటిస్తున్న సినిమాలో కూడా ఆకట్టుకునే లుక్‌తో కనిపించబోతున్నాడు.

కళ్యాణ్‌ రామ్‌, గుహన్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. అయినా కూడా తాజాగా కళ్యాణ్‌ రామ్‌ బర్త్‌డే సందర్బంగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆ పోస్టర్‌లో కళ్యాణ్‌ రామ్‌ లుక్‌ చాలా బాగుందని, చాలా స్టైలిష్‌గా కళ్యాణ్‌ రామ్‌ కనిపిస్తున్నాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది. ‘మిర్చి’ చిత్రంలో ప్రభాస్‌లా స్టైలిష్‌గా కళ్యాణ్‌ రామ్‌ కనిపిస్తున్నాడని, తప్పకుండా ఈ చిత్రంతో కళ్యాణ్‌ రామ్‌ సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో అనిపిస్తుందంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఇక వరుసగా చిత్రాలు చేస్తూ సినిమాల సంఖ్య పెంచుకుంటున్న కళ్యాణ్‌ రామ్‌ సక్సెస్‌ల సంఖ్య మాత్రం పెంచుకోలేక పోతున్నాడు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ చిత్రంతో అయిన మనోడు సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి. త్వరలోనే ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించి, టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరాకు ముందు లేదా తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.