నోకియా 6.1 ధర భారీగా తగ్గింపు..!

nokia mobile price

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌కు చెందిన రెండు వేరియెంట్లపై ఏకంగా రూ.10వేల వరకు ధర తగ్గింది. నోకియా 6.1 ఫోన్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,999 ఉండగా, ఇప్పుడీ వేరియెంట్ ధర రూ.10వేలు తగ్గింది. దీంతో దీన్ని రూ.6,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక ఇదే ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.18,999 ఉండగా దీన్ని రూ.9వేలు తగ్గించారు. దీంతో ఈ వేరియెంట్‌ను ప్రస్తుతం రూ.9,999 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్‌లో 5.5 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.