పంజాగుట్ట మర్డర్ కేసులో కీలక మలుపు…చంపింది అతనే ?

panjagutta murder case

హైదరాబాద్ లోని పంజాగుట్టలో ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య చేయించింది కోగంటి సత్యం అని రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపించిన నేపధ్యంలో ఈ ఆరోపణలకు తెర దించుతూ రాంప్రసాద్ ను హత్య చేసింది తానే అంటూ శ్యామ్ అనే వ్యక్తి ‘టీవీ 9’ కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన అనుచరులు చోటు, రమేశ్ తో కలిసే ఈ హత్య చేశానని శ్యామ్ పేర్కొన్నాడు. పదిహేను రోజులు రెక్కీ నిర్వహించి, ఈ హత్య చేశామని, ఆ తర్వాత ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు పారిపోయానని చెప్పాడు. రాం ప్రసాద్ ను హత్య చేస్తే నా డబ్బులు నాకు వస్తాయని రాంప్రసాద్ బావమరిది ఊర శ్రీనివాస్ నాకు చెప్పాడని, అందుకే, ఈ హత్య చేశానని అన్నాడు. ఈ హత్యతో కోగంటి సత్యంకు ఎటువంటి సంబంధం లేదని ఆయన ప్రకటించాడు. ఇటునుండి ఇటే వెళ్లి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో లొంగిపోతానని ఆయన పేర్కొన్నాడు.