నిక్కీ హేలీపై ఉత్త‌ర‌కొరియా అనుచిత వ్యాఖ్య‌లు

north-korea-sensational-comments-on-us-ambassador-un-nikki-haley

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

క్షిప‌ణి ప్ర‌యోగాలు, హైడ్రోజ‌న్ బాంబుల‌తో ప్ర‌పంచాన్ని హ‌డ‌లెత్తిస్తున్న ఉత్త‌ర‌కొరియా తాజాగా మ‌రో కోణాన్ని బ‌య‌ట‌పెట్టింది. చీటికీ మాటికీ అమెరికాతో క‌య్యానికి కాలు దువ్వే ఆ దేశం త‌ర‌చుగా రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తుంటుంది. అయితే ఇప్ప‌టిదాకా ఆ దేశం చేసే హెచ్చ‌రిక‌లుకానీ, వ్యాఖ్య‌లుకానీ ఎక్క‌డా శృతి మించ‌లేదు. కానీ తాజాగా ఉత్త‌ర‌కొరియా ఐక్య‌రాజ్య‌స‌మితిలో అమెరికా రాయ‌బారి నిక్కీ హేలీని అత్యంత అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించింది.

స్క‌ర్టులు ధ‌రించే నిక్కీ హేలీ ఓ వేశ్య‌లాగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఉత్త‌రకొరియా అనుచిత వ్యాఖ్య‌లు చేసింది. వేశ్య‌లాంటి ఆమెకు ట్రంప్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారంటూ ఎద్దేవా చేసింది. ఈ మేర‌కు ఉత్త‌ర‌కొరియా సెంట్ర‌ల్ న్యూస్ ఏజెన్సీ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. అంత‌ర్జాతీయ స‌మాజం హెచ్చ‌రిక‌ల‌ను బేఖాత‌రు చేస్తూ ఉత్త‌ర‌కొరియా ప‌దే ప‌దే అణుప‌రీక్షలు నిర్వ‌హించ‌టంపై అమెరికా ఆగ్ర‌హంతో ఉంది.

ఉత్త‌ర‌కొరియా పై క‌ఠిన ఆంక్ష‌లు విధించాల‌ని నిక్కీ హేలీ డిమాండ్ చేస్తున్నారు. కొరియా త‌న అణుప‌రీక్ష‌ల‌తో యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నార‌ని ఐక్య‌రాజ్య‌స‌మితిలో నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. దీంతో ఆమెపై సీరియ‌స్ అయిన ఉత్త‌ర‌కొరియా దారుణ ప‌ద‌జాలంతో విమ‌ర్శించింది. త‌మ దేశం గురించి మాట్లాడేట‌ప్పుడు నిక్కీ హేలీ త‌న నోరును అదుపులో పెట్టుకోక‌పోతే అమెరికా మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది.నిక్కీ హేలీపై ఉత్త‌ర‌కొరియా చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అటు హైడ్రోజ‌న్ బాంబు ప్ర‌యోగాన్ని ఐరాస‌లో ఉత్త‌ర‌కొరియా రాయ‌బారి హాన్ టే సాంగ్ స‌మ‌ర్థించుకున్నారు.

ఓ స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ హైడ్రోజ‌న్ బాంబును త‌మ దేశం విజ‌య‌వంతంగా ప‌రీక్షించిద‌ని చెప్పేందుకు గ‌ర్విస్తున్నాన‌ని తెలిపారు. ఈ ప్ర‌యోగాన్ని ఆత్మ‌ర‌క్ష‌ణ చ‌ర్య‌లుగా అభివ‌ర్ణించిన హాన్ టే సాంగ్ .. అమెరికాకు ఇది గిఫ్ట్ ప్యాకేజీ వంటిద‌న్నారు. ఉత్త‌ర‌కొరియా ను రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌ను అమెరికా కొన‌సాగించినంత కాలం ఆ దేశం త‌మ నుంచి గిఫ్ట్ ప్యాకేజీలు అందుకుంటూనే ఉంటుంద‌ని తేల్చిచెప్పారు.

మరిన్ని వార్తలు:

కోస్తాలో వైసీపీ కి పంగనామాలు.

నారా నానమ్మ స్పీచ్ కి మనవడి చప్పట్లు.

అంటార్కిటికాలో మ‌రో ప్ర‌పంచం