అమెరికా ఉపాధ్యక్ష పదవికి వివేక్ రామస్వామి తగిన వ్యక్తి : డొనాల్డ్ ట్రంప్

Vivek Ramaswamy
Vivek Ramaswamy

రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందంజలో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. వివేక్ చాలా తెలివైన వ్యక్తి అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉంటారు’ అని కొనియాడారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్​ను.. మీరు ఆయన్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా పరిగణించారా? అని హోస్టు ప్రశ్నించగా.. ‘ఆయన తగిన వ్యక్తి’
అని భావిస్తున్నానని ట్రంప్ బదులిచ్చారు.

ఇటీవల ఆగస్టు 23వ తేదీన రిపబ్లికన్‌ పార్టీ తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్​లో వివేక్‌ రామస్వామి, నిక్కీ హేలీ తదితర ఆశావహులు పాల్గొన్నారు. ఈ డిబేట్​లో వివేక్​కు భారీ ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంపై ట్రంప్‌ తన అభిప్రాయం వెల్లడిస్తూ వివేక్‌ను అభినందించారు. ‘డిబేట్‌లో వివేక్‌ రామస్వామి నిజాయతీ కారణంగా భారీ విజయం సాధించినట్లు నేను భావిస్తున్నాను. థాంక్యూ వివేక్‌’ అని తన సొంత సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌లో ట్రంప్‌ పేర్కొన్నారు.