బంగ్లాదేశ్ కు గట్టి దెబ్బ …ఆసియా కప్ నుండి లిటన్ దాస్ అవుట్ !

Bangladesh
Bangladesh

ఈ రోజు నుండి ఆసియా కప్ టోర్నమెంట్ శ్రీలంక మరియు పాకిస్తాన్ లు వేదికలుగా జరగనుంది. ఈ టోర్నమెంట్ లో మొత్తం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. ఆసియా కప్ మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ నేపాల్ తో తలపడనుంది. కాగా తాజాగా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ టీం కు భారీ షాక్ తగిలిందని తెలుస్తుంది . ఇప్పటికే బంగ్లాదేశ్ ఆసియా కప్ లో పాల్గొననున్న టీం ను ప్రకటించగా, అందులో వైరల్ ఫీవర్ కారణం గా కీపర్ బ్యాట్స్మన్ అయిన లిటన్ దాస్ కు జట్టుతో పాటు శ్రీలంక బయలుదేరలేదని టీం యాజమాన్యం తెలిపింది,

అంతేకాకుండా ఇక లిటన్ ఆసియా కప్ కు దూరం అయ్యాడని అధికారికంగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ తరపున వన్ డే లలో ఇటీవల మంచి స్ట్రైక్ రేట్ కలిగిన బ్యాట్స్మన్ గా ఉన్నాడు.ఇది నిజంగా బంగ్లాకు గట్టి దెబ్బ అని చెప్పాలి. కానీ ఇంతలోనే ఇలా జరగడం దురదృష్టకరం అంటూ అభిమానులు ఫీల్ అవుతున్నారు. బంగ్లా టీం యాజమాన్యం ఇతని స్థానంలో అనాముల్ హాక్ ను తీసుకుంది.