నాగ చైతన్య “ధూత” నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్..!

నాగ చైతన్య “ధూత” నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్..!
Cinema News

టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య గురించి తెలియని వారుండరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు , నాగచైతన్య గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా నాగచైతన్య మరో హీరోయిన్ శోభితా ధూలిపాళతో డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు వస్తూ ఉన్నాయి . ఈ ఇద్దరూ రెండు మూడు సార్లు కలిసి కనిపించడంతో వీటికి మరింత బలం చేకూరింది. వీరి డేటింగ్ రూమర్లపై సమంత వ్యాఖ్యలు చేసినట్టుగా ఒక మీడియా రాసింది.

నాగ చైతన్య “ధూత” నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్..!
NC-23

ఇది ఇలా ఉండగా.. నాగచైతన్య అక్కినేని హీరోగా ‘NC23’ వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపే ఓ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించనుంది. ఉపాధి కోసం సముద్ర వేట చేస్తూ పాకిస్తాన్ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. సినిమాలోని పాత్ర కోసం చైతు మేకోవర్ అవుతున్నారు.