జైలవకుశ ప్రమోషన్ ఇలాగా ?

NTR and Kalyan Ram did Different Pramotion for Jai Lava Kusa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా జైలవకుశ. ఎన్టీఆర్ కెరీర్ లో ఇది 27 వ సినిమా. ఇక నిర్మాత కళ్యాణ్ రామ్ కి విడుదలకి ముందే భారీ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రం. ఎన్టీఆర్ కెరీర్ లో అతి పెద్ద బిజినెస్ జరిగిన చిత్రం. అయినా నందమూరి బ్రదర్స్ సంతృప్తి చెందడం లేదు. ఈ సినిమాలో తమతో పాటు భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఆర్ధికంగా, కెరీర్ పరంగా ఇది గొప్ప సినిమా కావాలని భావిస్తున్నారు. అందుకే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ప్రమోషన్ చేస్తున్నాడు. ప్రతి టీవీ ఛానల్ తో జైలవకుశ విశేషాలు చెబుతూ ఈ సినిమా మీద అంచనాల్ని ఇంకాస్త పెంచుతున్నాడు.

NTR and Kalyan Ram did Different Pramotion for Jai Lava Kusa

ఓ వైపు టీవీలు, పత్రికల్లో ప్రచారం హోరు ఎత్తిస్తున్న నందమూరి బ్రదర్స్ ఈ సినిమా ప్రచారాన్ని అప్పటి లవకుశ టైపు లో వీధివీధినా ప్రచారం చేయిస్తున్నారు. ఆ టైపు ప్రచారం చేస్తోంది ఏ పల్లెటూల్లోనో కాదు. హైదరాబాద్ నడిబొడ్డున జైలవకుశ పోస్టర్స్ తో కూడిన చిన్నపాటి హోర్డింగ్స్ పట్టుకున్న కుర్రోళ్ళు వీధివీధీ తిరుగుతున్నారు. ఈ ప్రచారం చూస్తుంటే జైలవకుశ మీద నందమూరి బ్రదర్స్ ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో అర్ధం అవుతుంది.