ఎన్టీఆర్‌ ఆర్మీ లుక్‌ అదిరింది

NTR Army Look in Trivikram Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’ చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌లను దక్కించుకున్న ఎన్టీఆర్‌ త్వరలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇక ఈ చిత్రం కోసం ఇప్పటికే స్క్రిప్ట్‌ను సిద్దం చేసిన త్రివిక్రమ్‌ అందుకు తగ్గ లుక్‌కు ఎన్టీఆర్‌ను తీసుకు వచ్చాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రంలో ఎన్టీఆర్‌ ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే అల్లు అర్జున్‌ ఆర్మీ పాత్రతో సినిమాను చేస్తున్నాడు. బన్నీ లుక్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఎన్టీఆర్‌ తన ఆర్మీ లుక్‌పై చాలా ప్రత్యేకమైన శ్రద్దను పెట్టాడు.

గత రెండు నెలలుగా ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎట్టకేలకు ఎన్టీఆర్‌ న్యూ లుక్‌ సిద్దం అయ్యింది. ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ ఎన్టీఆర్‌ హెయిర్‌ను ఆర్మీ లుక్‌కు మార్చడం జరిగింది. దాంతో పాటు బరువు విషయంలో కూడా మార్పులు వచ్చాయి. పక్కా ఆర్మీ ఆఫీసర్‌గా ఎన్టీఆర్‌ కనిపించేందుకు సిద్దం అయ్యాడు. గతంలో శక్తి చిత్రంలో ఎన్టీఆర్‌ ఆర్మీ పాత్రలో నటించాడు. అయితే ఆ చిత్రం మరియు ఆ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని ఎన్టీఆర్‌ సిద్దం అవుతున్నాడు. లుక్స్‌తో పాటు బాడీ లాంగ్వేజ్‌ కూడా చాలా జాగ్రత్తగా మెయింటెన్‌ చేయాలని ఎన్టీఆర్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈనెలలో ప్రారంభం కాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.