చైతూ, సమంత ఒక ప్రేయసి

Naga Chaitanya Siva Nirvana Movie Title Preyasi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇదే సమయంలో మారుతి దర్శకత్వంలో ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు పూర్తి అవ్వకుండానే చైతూ ఒక రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ చిత్రాన్ని శివ నిర్వాన దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. నానితో ‘నిన్ను కోరి’ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్‌ను దక్కించుకున్న ఈ దర్శకుడు నాగచైతన్యతో చిత్రాన్ని చేసేందుకు అంతా సిద్దం చేశాడు. తాజాగా ఈ చిత్రానికి ‘ప్రేమసి’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

నాగచైతన్యకు జోడీగా నటించే హీరోయిన్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఒక ముఖ్య పాత్రలో సమంత నటించబోతుంది అని మాత్రం సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. పెళ్లి అయిన తర్వాత నాగచైతన్య మరియు సమంతలు కలిసి నటించనున్న సినిమా అవ్వడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. నాగచైతన్యకు మాజీ లవర్‌గా సమంత కనిపించే అవకాశం ఉందని, అందుకే ఈ సినిమాకు ‘ప్రేయసి’ అనే టైటిల్‌ను ఖరారు చేసి ఉంటారు అనిపిస్తుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది. ప్రముఖ రచయిత కోన వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.