సమంత సినిమాలకు గుడ్‌బై పై చైతూ స్పందన

Naga Chaitanya gives clarity on Samantha Goodbye to Movies

గత కొన్ని రోజులుగా సమంత కొత్త సినిమాలు ఏమీ ఒప్పుకోక పోవడంతో తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలకు సమంత గుడ్‌బై చెప్పబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళంలో ఒక స్టార్‌ హీరో సినిమాలో సమంతకు ఛాన్స్‌ వచ్చినా కూడా సున్నితంగా తిరష్కరించిందట. దాంతో తమిళ మీడియాలో వార్తలు మొదలు అయ్యాయి. సమంతకు సినిమాలకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చినట్లుగా ఉందని ప్రచారం జరిగింది. సమంత తెలుగు సినిమాలకు కూడా గుడ్‌బై చెప్పనుంది అంటూ తెలుగు మీడియాలో కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈసమయంలోనే నాగచైతన్య సమంతపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.

నాగచైతన్య తాజాగా మాట్లాడుతూ… సమంతకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పటికి సినిమాలను వదిలి పెట్టదు అని, ఆమె సినిమాలకు దూరంగా ఉండాలని తాను కూడా కోరుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఏదైనా కారణం వల్ల బ్రేక్‌ తీసుకుంటే తీసుకోవచ్చు తప్ప, సినిమాలకు దూరంగా అయితే ఉండదు అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. నాగచైతన్య మాటలను బట్టి అర్థం అయ్యింది ఏంటీ అంటే ప్రెగ్నెంట్‌ అయితే తప్ప సమంత సినిమాలకు బ్రేక్‌ తీసుకోదు అని, ఆమె సినిమాల్లో కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. సినిమాలకు తన అవసరం ఉందనిపించే వరకు ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక వీరిద్దరి కాంభినేషన్‌లో శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఇక సమంత నటించిన యూ టర్న్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతుంది.