శ్రీకాంత్‌కు ఇంకా ఆ మోజు తీరలేదా?

Srikanth Kothala Rayudu movie heroines are Dimple and Natasha

ఫ్యామిలీ చిత్రాల హీరోగా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన శ్రీకాంత్‌ గత కొన్ని సంవత్సరాలుగా హీరోగా చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడుతూ వస్తుంది. సినిమాకు పెట్టిన ప్రమోషన్స్‌ ఖర్చుల వరకు కూడా కలెక్షన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా శ్రీకాంత్‌ సినిమాల్లో హీరోగానే నటించాలని కోరుకుంటున్నాడు. జగపతిబాబు వంటి వ్యక్తి హీరోగా ఇక ఛాన్స్‌ లేదని భావించి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సెటిల్‌ అయిన ఈ సమయంలో శ్రీకాంత్‌ మాత్రం ఇంకా తాను హీరోనే అంటూ భీష్మించుకు కూర్చున్నాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న శ్రీకాంత్‌ మెయిన్‌గా మాత్రం హీరోగానే సక్సెస్‌ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.

శ్రీకాంత్‌ హీరో వేశాలు మానేసి విలన్‌ వేశాలు లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అంతా వ్యక్తం చేస్తున్నారు. కాని శ్రీకాంత్‌ మాత్రం హీరో పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఆయనకు క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలు దక్కడం లేదు. చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణ చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రల్లో నటించిన శ్రీకాంత్‌ చిన్న హీరోల చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈమద్య ఒక చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించలేక పోయాడు. దాంతో విలన్‌గా తనను ప్రేక్షకులు చూడరని తనకు తాను ఫీల్‌ అయ్యి, హీరోగానే చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా ఈయన ‘కోతల రాయుడు’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్‌కు జోడీగా డింపుల్‌ మరియు నటాషాలు హీరోయిన్స్‌గా నటించబోతున్నారు. కుమారుడు హీరో అవ్వబోతున్న ఈ సమయంలో శ్రీకాంత్‌ ఇంకా హీరోగా చేయడంపై ఆయన సన్నిహితులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోతల రాయుడు ఫ్లాప్‌ తర్వాత అయినా శ్రీకాంత్‌ తన పద్దతి మార్చుకుంటాడేమో చూడాలి.