కత్తి మహేష్‌పై మెగా విజయం

police ban mahesh kathi from hyderabad

‘బిగ్‌బాస్‌’తో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న కత్తి మహేష్‌ ఆ క్రేజ్‌ను ఇంకాస్త పెంచుకునేందుకు పవన్‌ కళ్యాణ్‌ను ఎంచుకున్నాడు. పవన్‌ను చిన్న మాట అంటేనే ఖచ్చితంగా ఫ్యాన్స్‌ ఇంతెత్తుకు లేస్తారు. అలాంటిది పదే పదే ఆయన్ను విమర్శిస్తే ఇక మంచి పబ్లిసిటీ దక్కడంతో పాటు, యాంటీ పవన్‌ ఫ్యాన్స్‌ నుండి మద్దతు ఉంటుందని కత్తి మహేష్‌ భావించాడు. అలా దాదాపు మూడు నెలల పాటు పవన్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూనే వచ్చాడు. ఆమద్య వివాదం కాస్త ముదరడంతో కత్తి మహేష్‌ తన వ్యాఖ్యలను తగ్గించాడు. ఇక కత్తి మహేష్‌ అప్పుడప్పుడు మళ్లీ మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో కత్తి మహేష్‌పై రాముడిని దూషించిన కేసులో పోలీసులు అరెస్ట్‌ చేయడం జరిగింది.

ఈ విషయంలో నాగబాబు ఇన్వాల్వ్‌ అయ్యి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కత్తి మహేష్‌ విషయంలో సీరియస్‌గా వ్యవహరించాలని డిమాండ్‌ చేశాడు. నాగబాబు పిలుపు మేరకు పలువురు ప్రముఖులు కూడా కత్తి విషయమై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. హిందూ సంఘాల వారు పాదయాత్రు, ఇంకా పలు నిరసన కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో కత్తి మహేష్‌ను తెలంగాణ నుండి బహిష్కరిస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. ఈ ప్రకటన రావడం వెనుక మెగా ఫ్యామిలీ కీలకంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యల తీవ్రతను మెగా బ్రదర్‌ నాగబాబు పెంచేలా సీఎంలకు విజ్ఞప్తి చేయడంతో కత్తి మహేష్‌ రాష్ట్ర బహిష్కరణకు గురైనట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కత్తి మహేష్‌పై మెగా ఫ్యాన్స్‌ విజయం దక్కించుకున్నాం అనే సంతోషంతో ఉన్నారు.