చై-సామ్ ప్రేమ‌బంధం

Samantha posted Naga Chaitanya video Call photo

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ జంట నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల ప్రేమ బంధం పెళ్లి త‌ర్వాత మ‌రింత బ‌ల‌పడుతోంది. చై,సామ్ ఇద్ద‌రూ ఒక‌రిపైఒక‌రు అంతులేని ప్రేమానురాగాలు చూపించుకుంటున్నారు. పెళ్లి స‌మంత కెరీర్ లో ఎలాంటి మార్పూ తేలేదు. వివాహం ముందులానే… వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ ఆమె విజ‌య‌వంతంగా త‌న కెరీర్ కొన‌సాగిస్తోంది. మ‌రో ప‌క్క చైత‌న్య కూడా షూటింగుల‌తో నిత్యం బిజీగా ఉంటున్నాడు. యుద్ధం శ‌ర‌ణం త‌ర్వాత చైత‌న్య హీరోగా న‌టిస్తున్న స‌వ్యసాచి షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం చై ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్నాడు. యూనిట్ తో క‌లిసిదిగిన ఫొటోల‌ను ఇటీవ‌లే చై ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు కూడా. స‌మంత కూడా సినిమాలతో బిజీగా ఉండ‌డంతో భ‌ర్త‌తో క‌లిసి అమెరికా వెళ్లేందుకు ఆమెకు వీలులేదు.

మ‌హాన‌టి, అభిమ‌న్యుడు ప్ర‌మోష‌న్స్ కోసం స‌మంత హైద‌రాబాద్-చెన్నై మ‌ధ్య తీరికలేకండా ప్ర‌యాణాలు చేస్తోంది. ఈ నేప‌ధ్యంలో భ‌ర్త‌ను చాలా మిస్స‌వుతున్నానంటూ ఇన్ స్టాగ్ర‌మ్ లో ఓ ఫొటో పోస్ట్ చేసింది స‌మంత‌. చైతో వీడియో కాల్ మాట్లాడుతుండ‌గా తీసిన స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసిన స‌మంత దానిపై తిరిగి వ‌చ్చేయ్ అని రాసింది. మొత్తానికి ఈ జంట ప్రేమ‌బంధాన్ని చూసి టాలీవుడు ప్రేక్ష‌కులు ముచ్చ‌ట‌పడుతున్నారు.