మహానటి తర్వాత అమ్మ పాత్రలో..!

Keerthy Suresh Turned Into Mahanati Savitri

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సావిత్రి సినిమాను తీయాలనుకున్నప్పుడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్‌ను పరిశీలించాడు. ఫైనల్‌గా సమంత, కీర్తి సురేష్‌లతో పాటు మరో ఇద్దరి పేర్లను ఫైనల్‌ చేశాడట. ఆ నలుగురికి ఆడిషన్స్‌ చేయడం, మేకప్‌ టెస్ట్‌ చేయడం చేసిన తర్వాత సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ అయితే పక్కాగా సూట్‌ అవుతుందని ఆయన భావించాడు. ఆమె కూడా మొదట టెన్షన్‌ పడ్డా, ఆ తర్వాత పూర్తిగా లీనం అయ్యి నటించారు. తాజాగా విడుదలైన పోస్టర్స్‌ మరియు టీజర్‌లు సినిమా స్థాయిని పెంచాయి. సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ తప్ప మరెవ్వరు న్యాయం చేయలేరేమో అన్నట్లుగా ఈ అమ్మడు ఆకట్టుకుంది. సావిత్రి వంటి పవర్‌ ఫుల్‌ పాత్రను పోషించిన తర్వాత ఇప్పుడు అంతే పవర్‌ ఫుల్‌ పాత్రను కీర్తి సురేష్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

వెండి తెరపై తనదైన ముద్రను వేసి, రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి వెళ్లిన జయలలిత ఈమద్యే అనంతలోకాలకు వెళ్లిన విషయం తెల్సిందే. ఆమె జీవితం సినిమా కంటే ఎక్కువ ట్విస్ట్‌లు, మలుపులతో సాగింది. జయలలిత వివాహం చేసుకోక పోవడం వెనుక ఎన్నో ఊహాగాణాలు వినిపించాయి. ఆమెకు ఒక కూతురు ఉందనే ప్రచారం జరిగింది. ఇలా ఎన్నో రకాలుగా జయలలిత గురించి సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. అందుకే జయలలిత గురించి అందరికి తెలియజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ప్రముఖ తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళ జనాలు అమ్మగా భావించే జయలలిత పాత్రకు గాను కీర్తి సురేష్‌ను సంప్రదించినట్లుగా తెలుస్తోంది.