ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ చిరు నిర్మాతకి హ్యాండ్?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

NTR Bio Pic Movie Producer Induri Vishnu Cheats Producer Ashwani Dutt

ప్రస్తుతం తెలుగు వారి నోళ్ళలో నానుతాన్న ఒకే ఒక్క విషయం ఎన్టీఆర్ బయోపిక్. ఈ సినిమాకి తానే దర్శకుడినని రామ్ గోపాల్ వర్మ ప్రకటన చేసేసారు. ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్న నటసింహం బాలయ్య మాత్రం ఇంకా ఈ మేటర్ మీద నోరు తెరవలేదు. ఆ మౌనానికి అర్ధం ఏమిటో బాలయ్య ఫాన్స్ కి కూడా తెలియడం లేదు. ఇక ఇంత సంచలనాత్మక కాంబినేషన్ సెట్ చేసింది ఏ భారీ నిర్మాతో కాదు. ఇప్పటిదాకా వినిపిస్తున్న దాని ప్రకారం ఈ సినిమాకి విష్ణు ఇందూరి నిర్మాత. ఆయన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యారు. అసలు ఎవరీ విష్ణు ఇందూరి?. దీనిపై ఆరా తీస్తే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుజూశాయి.

విష్ణు ఇందూరి కృష్ణా జిల్లావాసి అయినా ప్రకాశం జిల్లాతో ను దగ్గర సంబంధాలు వున్నాయి. ఒకప్పటి మార్టూరు నియోజకవర్గంలో ఓ రాజకీయ కుటుంబపు ఆడపడుచు విష్ణు తల్లి. ఇక కృష్ణా జిల్లాకి వచ్చేసరికి ప్రముఖ నిర్మాత చిరంజీవితో ఎన్నో సినిమాలు తీసిన అశ్వనీదత్ కి చుట్టం. ఆ బంధుత్వంతోనే విష్ణు ని ప్రోత్సహించడానికి దత్ లోకల్ టీవీ పెట్టారు. ఈ కాన్సెప్ట్ తీసుకుని దత్ ,ఆయన స్నేహితుల్ని ఒప్పించిన విష్ణు దాని నిర్వహణలో విఫలం అయ్యారు. మొత్తం నష్టాల్ని దత్ కుటుంబం మీద వదిలేసినట్టు తెలుస్తోంది. ఇక లోకల్ టీవీ నిర్వహణలోనూ ఈయన చేతివాటం బయటపడినట్టు గుసగుసలు వినిపిస్తాయి. ఈ నష్టాలు, ఇబ్బందుల నుంచి బయట పడేందుకు దత్ కుమార్తె స్వప్న చాన్నాళ్లు కష్టపడాల్సి వచ్చింది. ఇలా చిరు ప్రొడ్యూసర్ కి హ్యాండ్ ఇచ్చిన విష్ణు ఆ తర్వాత సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహించారు. మొత్తానికి ఇప్పుడు బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ బయోపిక్ కి నిర్మాతగా మారారు.