నందమూరి అందగాడు చిందులేయగా తెలుగువారి నరనరము నాట్యమాడ…!

Ntr-Biopic-Movie-New-Poster

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ స్టిల్ ఈరోజు విడుదలైంది. ఎన్టీఆర్ గెటప్ లో మరోసారి బాలయ్య అభిమానులను పలకరించాడు. వేటగాడు సినిమాలో ఆకుచాటు పిందె తడిసే పాటలో అచ్చు ఎన్టీఆర్ ను గుర్తుకు తెస్తున్నాడు. అదే సూట్, అవే బూట్లు, అదే బెల్ బాటమ్ ప్యాంట్, అదే స్టైల్, అదే ఎక్స్ ప్రెషన్, మొత్తంగా ఎన్టీఆర్ ను దింపేశాడు నందమూరి బాలకృష్ణ. నందమూరి అందగాడు చిందులేయగా తెలుగువారి నరనరము నాట్యమాడగా అనే ట్యాగ్ లైన్ తో ఈ ఫొటోను విడుదల చేసింది చిత్రయూనిట్.

ntr pic

క్రిష్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని సంక్రాంతి కానుకగా అదే జనవరిలో రిపబ్లిక్ డే సందర్బంగా రెండవ భాగాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంపై ఉన్న అంచనాల నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కూడా భారీగా బిజినెస్ అవుతోంది. ఎన్టీఆర్ నుండి వస్తున్న ఒక్కో పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తూనే ఉన్నాయి.