ఎదిరిస్తే ఏం చేస్తాడు దేవుడు….సుభ్రమణ్యపురం టీజర్…!

Sumanth's-Subrahmanyapuram-

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సుబ్రమణ్యపురం’. ‘మళ్లీరావా’ చిత్రంతో చాలా కాలం తర్వాత ఓ విజయాన్ని నమోదు చేసుకున్న సుమంత్‌ ఈ సినిమా మీద కూఅడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. టారస్‌ సినీకార్స్‌ పతాకం పై ధీరజ్‌ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అరవింద సమేతలో అరవింద చెల్లెలిగా మెరిసిన ఈషా కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం తుది దశ చిత్రీకరణలో ఉంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్‌ను బట్టీ చూస్తుంటే ఇది సుబ్రమణ్యపురం ఊరిలోని గుడి నేపథ్యంగా సాగే ఓ ఆసక్తిర కథాంశంతో రూపొందినట్లు అర్థమవుతోంది. ‘‘శివానంద తీర్థులు మన ఊరికి ఉన్నట్లుండి ఎందుకొచ్చారు’ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘‘ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒకడ్ని సిద్ధం చేసే ఉంచాడు’’ అని శివానంద తీర్థులు చెబుతున్నారు. ‘‘కార్తీక్‌.. ఈయన ఇలా హేతుబద్ధంగా ఆలయాలపై పరిశోధన చేస్తున్నారు’’ అంటూ సుమంత్‌ను సూర్య పరిచయం చేశారు. ‘‘నువ్వు దేవుడ్ని ఎదిరిస్తున్నావ్‌?’.. అంటే ‘ఎదురొస్తే ఏం చేస్తాడండీ మీ దేవుడు.. ఏం చేస్తాడు’’ అని సుమంత్ ప్రశ్నతో టీజర్ ముగుస్తుంది. ఇందులో దేవుడినే ఎదిరించే వ్యక్తిగా సుమంత్ అలరించబోతున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠకు తెరలేపింది. తాజాగా టీజర్ విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. కేవలం 55 సెకనుల నిడివితో విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. టీజర్‌లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. మరి మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.