ఆ పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడు’..: గదర్-2 డైరెక్టర్

ఆ పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడు'..: గదర్-2 డైరెక్టర్
latest News

Jr. NTR:ఆర్ఆర్ఆర్’ మూవీ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు జూ.ఎన్టీఆర్. ఆయన నటనకు ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలు కూడా లభించాయి. తాజాగా ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ అనిల్ శర్మ గారు .

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తో బాలీవుడ్ తోపాటు వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాడు జూ.ఎన్టీఆర్. దీంతో తారక్(NTR) తో సినిమా చేసేందుకు టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేశాడు . రీసెంట్ గా హిందీలో రిలీజైన గదర్ 2 మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా 500 కోట్ల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది. అనిల్ శర్మ(Anil Sharma) దర్శకత్వం వహించిన ఈ సినిమా లో సన్నీ డియోల్ లీడ్ రోల్ లో నటించాడు.

ఆ పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలడు'..: గదర్-2 డైరెక్టర్
NTR

అయితే గదర్-2 దర్శకుడు అనిల్ శర్మను ఓ ఇంటర్వ్యూలో సన్నీడియోల్‌ కాకుండా తారాసింగ్‌ పాత్రను నేటి తరం హీరోల్లో ఎవరు సమర్థవంతంగా పోషించగలరనుకుంటున్నారు? అని ఓ విలేకరు ప్రశ్నించాడు. “నాకు తెలిసి ఈ క్యారెక్టర్ ను చేయగల నటుడు బాలీవుడ్‌లో అయితే ఎవరూ లేరంట . అనిల్ అక్కడితో ఆగకుండా సౌతిండియాలో మాత్రం జూ. ఎన్టీఆర్‌ తారాసింగ్‌ పాత్రకు అద్భుతంగా న్యాయం చేయగలడు” అని చెప్పారు. లెజెండరీ డైరెక్టర్ నుండి ఇలాంటి కాంప్లిమెంట్ వచ్చిందంటే ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటిదో అని మనం అర్థం చేసుకోవచ్చు.