అన్న తారక్‌… తమ్ముడు చరణ్‌

NTR plays elder Brother Ram Charan plays Younger Brother in Rajamouli Multistarrer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రంకు సంబంధించిన వార్త రోజుకొక్కటి అయినా మీడియాలో వస్తుంది. రాజమౌళి ఇద్దరు హీరోలతో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసినప్పటి నుండి కూడా మీడియాలో వార్తలకు హద్దు పద్దు లేకుండా పోతుంది. నిన్న మొన్నటి వరకు సమంత హీరోయిన్‌గా నటించబోతుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదని, ఇంకా హీరోయిన్‌ ఫైనల్‌ కాలేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరో ఆసక్తికర పుకారు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ఎలా కనిపించబోతున్నారు అనే విషయంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు అన్నదమ్ముళ్లుగా కనిపించబోతున్నారట. అన్నగా ఎన్టీఆర్‌ నటించనుండగా, చరణ్‌ తమ్ముడుగా కనిపిస్తాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో పెద్దోడు వెంకటేష్‌, చిన్నోడు మహేష్‌బాబులు కనిపించారు. ఇప్పుడు అదే తరహాలో పెద్దోడి పాత్రలో ఎన్టీఆర్‌, చిన్నోడి పాత్రలో చరణ్‌ కనిపించబోతున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులు అన్నదమ్ముళ్ల సెంటిమెంట్‌తో పదుల కొద్ది సినిమాలు చూశారు. కాని రాజమౌళి తెరకెక్కించబోతున్న సినిమా మాత్రం చాలా విభిన్నం అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. జక్కన్న అద్బుతమైన స్క్రిప్ట్‌తో, ఆకట్టుకునే కాస్టింగ్‌తో సినిమాను అమాంతం ఆకాశాన ఉంచేలా తెరకెక్కిస్తాడనే నమ్మకంను ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. చరణ్‌ తమ్ముడిగా, ఎన్టీఆర్‌ అన్నగా నటించి ఎలా అలరిస్తారో చూడాలి.