దాని కోసమే జ‌గ‌న్ రాష్ట్రాన్ని తాక‌ట్టు పెడుతున్నారుః య‌న‌మ‌ల

Yanamala Ramakrishnudu Comments on Ys jagan over special status

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌తిప‌క్ష వైసీపీపై ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. వైసీపీ సాగుతున్న తీరు ఎవ‌రికీ అర్దం కావ‌డం లేద‌ని, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ఓ సారి బీజేపీతో క‌లుస్తామంటార‌ని, మ‌రోసారి కేంద్ర‌ప్ర‌భుత్వంపై అవిశ్వాస‌తీర్మానం ప్ర‌వేశ‌పెడ‌తామంటార‌ని… వారి విధానాల్లో స్ప‌ష్టత లేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు తాక‌ట్టుపెట్ట‌యినా స‌రే కేసులు మాఫీ చేయించుకోడానికి జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని య‌న‌మ‌ల ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు కాపాడుకోవాల‌న్న ఉద్దేశంతో టీడీపీ నేత‌లు కేంద్ర‌మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారని తెలిపారు. తాము విభ‌జ‌న హామీలు నెర‌వేర్చుకోవాల‌న్న భావ‌న‌తో ఉంటే… జ‌గ‌న్ మాత్రం త‌న‌పై ఉన్న కేసులు మాఫీ చేయించుకోవాల‌నే ఉద్దేశంతో ఉన్నార‌ని, వైసీపీ పార్ల‌మెంట్ లోనూ డ్రామాలాడుతోంద‌ని మండిప‌డ్డారు.

వైసీపీ నాటకాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, రాబోయే రోజుల్లో గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు. విభ‌జ‌న హామీల విష‌యంలో కేంద్ర‌ప్ర‌భుత్వ వైఖ‌రిని య‌న‌మ‌ల త‌ప్పుబ‌ట్టారు. కేంద్రం రాష్ట్రానికి పూర్తిగా నిధులు ఇవ్వ‌లేద‌ని తాము అన‌లేద‌ని, కొంత ఇచ్చార‌ని, అలాగే ఇచ్చిన హామీల‌న్నింటినీ నెర‌వేర్చాల‌ని అన్నారు. స్పెష‌ల్ ప్యాకేజ్ ప్ర‌క‌టించిన కేంద్రం దాన్ని అమ‌లు చేయ‌నందున ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని అరుణ్ జైట్లీని కోరిన‌ట్టు య‌న‌మ‌ల తెలిపారు.