ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌కు బ్రేక్: హృతిక్ రోషన్ కు గాయం

ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌కు బ్రేక్: హృతిక్ రోషన్ కు గాయం
Cinema News

బాలీవుడ్ స్టార్​ హీరో హృతిక్ రోషన్ కి  తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కాలికి గాయమైనట్లు సోషల్‌ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఈ మేరకు అద్దం ముందు నిల్చున్న ఫొటోని కూడా షేర్‌ చేశారు. అందులో ఆయన నడుముకు బెల్ట్‌ పెట్టుకుని, క్రచస్‌ (ఊతకర్ర) సపోర్ట్‌తో నిల్చున్నారు. మీలో ఎంత మందికి ఈ క్రచస్‌ , వీల్‌ఛైర్‌ అవసరం వచ్చింది. అప్పుడు మీ ఫీలింగ్‌ ఏంటి? అంటూ క్యాప్షన్ ని రాసుకొచ్చారు.

ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌కు బ్రేక్: హృతిక్ రోషన్ కు గాయం

NTR War 2 shooting break: Hrithik Roshan injured

ఈ పోస్టు చూసిన టైగర్ ష్రాఫ్‌, వరుణ్‌ ధావన్‌, వాణీ కపూర్‌ సహా పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు ఆయన అభిమానులు హృతిక్ రోషన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హృతిక్ గాయం వల్ల కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తుంది . దీనివల్ల వార్‌ 2 మూవీ షూటింగ్​ వాయిదా పడే అవకాశం ఉంది. దర్శకుడు అయాన్‌ ముఖర్జీవార్​ 2 మూవీ ను గ్రాండ్ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్‌ యంగ్ టైగర్, హీరో ఎన్టీఆర్‌ నటించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్‌ కాస్త నెగెటివ్‌ షేడ్‌ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తారని ఆ మధ్య కథనాలు వచ్చాయి.