AP Politics: నా జీవితం మీ చేతిలోనే ఉంది: అనిల్ కుమార్ యాదవ్

AP Politics: My life is in your hands: Anil Kumar Yadav
AP Politics: My life is in your hands: Anil Kumar Yadav

నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ అన్న ఆదేశించాడని నెల్లూరులో నా సర్వస్వాన్ని వదిలి వచ్చేసా, పల్నాడు ప్రజలు, శాసన సభ్యులు నన్ను గెలిపిస్తారో, ఓడిస్తారో మీ ఇష్టం అన్నారు. మీ కుటుంబంలో ఒకడిలా ఉందామనుకున్నా, నా జీవితం మీ చేతిలోనే ఉంది. నన్ను పెంచుతారో, తెంచుతారో మీ ఇష్టం అని పేర్కొన్నారు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎలా ఆశీర్వదిస్తారో మీ ఇష్టం అన్నారు.

నాకు మీసం తిప్పాలని బాగా కోరిక… కానీ మా నెల్లూరులో ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు నేను మీసం తిప్పితే తట్టుకోలేరు… పౌరుషాల గడ్డ పల్నాడుకు వచ్చా , ఇక్కడ మీసం మేలేసి చెబుతున్నా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పైన ఉన్న ఆ దేవుడ్ని, తాడేపల్లిలో ఉన్న జగనన్ననీ నమ్మి వచ్చా..భగవంతుడు, మీరు ఏ రాత రాస్తారో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ చూడాలన్నారు. కోటప్పకొండ శివుడు సాక్షిగా చెబుతున్నా… నాకు ఎవరూ లేకపోయినా తండ్రి లాగా ,సాక్షాత్తు దైవంలాగా సీఎం జగన్ నన్ను ఆదరించాడని పేర్కొన్నారు.