‘డంకీ’ సినిమాను ఓటీటీలో ఎక్కడ చూడవచ్చు?

'డంకీ' సినిమాను ఓటీటీలో ఎక్కడ చూడవచ్చు?
Cinema News

దాదాపు ఐదేళ్ల తర్వాత గతేడాది పఠాన్ తో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న షారుక్ ఖాన్ జవాన్ ఇలా వరుస హిట్లతో బ్లాక్ బస్టర్ వసూళ్లు ని సాధించారు. ఇక గతేడాది చివరలో ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన డంకీ మూవీ తో షారుక్ అలరించారు. ఈ మూవీ ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే.

'డంకీ' సినిమాను  ఓటీటీలో ఎక్కడ చూడవచ్చు?
Dunki Movie

ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ రూ.230 కోట్లు వరకూ నెట్ వసూళ్లతో పాటు రూ. 470 కోట్లు వరకూ గ్రాస్ కలెక్షన్ల ని సాధించింది. లాభాలను అందుకుని క్లీన్ హిట్‌ టాక్​గా నిలిచిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ రూ. 180 కోట్లకు దక్కించుకుంది. తాజాగా ‘డంకీ’ మూవీ సైలెంట్ గా నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే స్ట్రీమింగ్​ కి తీసుకొచ్చి అభిమానులను నెట్ ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ చేసేసింది. అదనపు సన్నివేశాలను కూడా జోడించినట్లు సమాచారం. ఇంకెందుకు ఆలస్యం. ఈ వీకెండ్ ని డంకీతో జాలీగా ఎంజాయ్ చేసేయండి.