‘ఓజి’: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్!

'ఓజి': పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్!
Cinema News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా సినిమా ఓజి. ఈ సినిమా ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ స్థాయిలో నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం అనగా 2013 సెప్టెంబర్ 27 న పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది సినిమా అతి పెద్ద విజయం అందుకోవడం జరిగింది. ఇక అదే డేట్ కి ఓజి కూడా రిలీజ్ ఆవుతుండడంతో మరొక్కసారి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ హిస్టరీ రిపీట్ చేయడం ఖాయం అని అంటున్నారు పవన్ ఫ్యాన్స్.