ఓజీ: షాకింగ్ పోస్టర్‌తో అభిమానులకు పూనకాలే ..!

og-shocking-poster-for-fans
og-shocking-poster-for-fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ ఓజి.. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా తెరకెక్కుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ పైన ఉన్నంత బజ్ పవన్ నటిస్తున్న ఇంకే మూవీ పైన లేదని చెప్పాలి.

og-shocking-poster-for-fans
og-shocking-poster-for-fans

ఇకపోతే షూటింగ్ అప్డేట్, లొకేషన్ అప్డేట్స్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతి విషయంపై కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు కిక్కిచ్చే వార్తలను మేకర్స్ రిలీజ్ చేస్తూనే వస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరొక వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజైంది. దీనిని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.ఇందులో పవన్ కళ్యాణ్ వైట్ షర్ట్ ధరించి కత్తితో విలన్లని నరుకుతున్నట్లుగా కనిపిస్తోంది. పవన్ అభిమానులకు ఈ పోస్టర్ గూస్బంప్స్ తెప్పించేవిధంగా ఉంది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, శ్రియారెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు.