‘పైసా వసూల్‌’కు ఇదే పెద్ద మైనస్‌

paisa-vasool-movie-songs-are-not-good-to-the-audience

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పైసా వసూల్‌’ చిత్రం సెప్టెంబర్‌ 1న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే జరిగింది. ఆ వేడుకలో విడుదలైన ట్రైలర్‌ను ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది. సినిమాలో బాలయ్య దుమ్ము దులిపేసి ఉంటాడు అంటూ భావిస్తున్నారు. ట్రైలర్‌ను చూస్తుంటే సినిమా బాక్స్‌ బద్దలు కావడం ఖాయం అని అనుకుంటున్నారు. కాని అదే సమయంలో విడుదలైన పాటలను చూస్తుంటే సినిమా ఫలితంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందించాడు. సహజంగా అయితే అనూప్‌ సాఫ్ట్‌గా మంచి పాటలు అందిస్తాడు. కాని బాలయ్య ఆయనకు పూనాడో లేక పూరి మార్క్‌ చూపించాలని భావించాడో కాని చెత్త చెత్తగా పాటలకు ట్యూన్స్‌ ఇచ్చాడు. ఆల్బంలో ఉన్న ఏ ఒక్క పాట కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా లేవు. సినిమా సక్సెస్‌ కావాలి అంటే ఖచ్చితంగా పాటలు కూడా బాగుండాలి. కాని పాటలు చెత్తగా ఉండటంతో సినిమాకు అవే మైనస్‌ అవుతాయేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శ్రియ నటిస్తున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు:

స్పైడ‌ర్ సాంగ్ రాసిన త‌మిళ ర‌చ‌యిత‌

రాజమౌళి చేతుల మీదుగా మెగా151?

దిగజారాల్సిన అవసరం నాకు లేదు