లీక్‌.. అఖిల్‌2 మూవీ ఫస్ట్‌లుక్‌ ఇదే

Akhil 2 Movie First Look Leaked

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మొదటి చిత్రంతో తీవ్రంగా నిరాశ పర్చిన అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ చాలా గ్యాప్‌ తీసుకుని చేస్తోన్న చిత్రం ఫస్ట్‌లుక్‌ కోసం రెడీ చేసిన స్టిల్‌ లీక్‌ అయ్యింది. ఈనెల 21న అధికారికంగా విడుదల చేయాలనుకున్న స్టిల్‌ కాస్త లీక్‌ అవ్వడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు అవాక్కయ్యారు. చిత్ర డిజైన్స్‌ను చేస్తున్న డిజైనర్‌ వద్ద నుండి ఇది లీక్‌ అయ్యి ఉంటుందనే  టాక్‌ వినిపస్తుంది. ఇక ఈ లీక్‌పై చిత్ర యూనిట్‌ సభ్యులు హైరాన పడకుండా వెంటనే నాగార్జున ట్విట్టర్‌లో లీక్‌ అయిన స్టిల్‌ ఒరిజినల్‌ను విడుదల చేశాడు. కాస్త ఆగి విడుదల చేద్దామనుకున్న అఖిల్‌ రెండవ చిత్రం ఫస్ట్‌లుక్‌ లీక్‌ అయ్యింది. ఆ లీక్‌ పోస్టర్‌ ఒరిజినల్‌ ఇదే అంటూ పోస్ట్‌ చేశాడు. ఇక ఈనెల 21న ఈ చిత్రంకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రకటిస్తామంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. 

ఆ రోజు చిత్రం టైటిల్‌పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎన్నో టైటిల్స్‌ను పరిశీలించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ‘జున్ను’ అనే టైటిల్‌ను అనుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ ఈ టైటిల్‌ను కోరుకుంటున్నాడు. కాని నాగార్జున మాత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఒక మంచి టైటిల్‌ను నిర్ణయించాడు. దాన్ని త్వరలోనే రివీల్‌ చేయబోతున్నారు. 21న చిత్రం విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా కళ్యాణి ప్రియదర్శిణి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈమె ప్రముఖ దర్శకుడి కూతురు. ఈమెతో అఖిల్‌ రొమాన్స్‌ ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

లీక్‌.. అఖిల్‌2 మూవీ ఫస్ట్‌లుక్‌ ఇదే - Telugu Bullet

మరిన్ని వార్తలు:

దిగజారాల్సిన అవసరం నాకు లేదు

రాజమౌళి చేతుల మీదుగా మెగా151?

స్పైడ‌ర్ సాంగ్ రాసిన త‌మిళ ర‌చ‌యిత‌