అల్లుడి స్థానంలో పేపర్‌ బాయ్‌…!

Paperboy Movie Release On August 31

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 31న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే సినిమా విడుదలకు కేరళలో కురుస్తున్న వర్షాలు అడ్డంకి అయ్యాయి. కేరళలో ఉన్న భారీ వర్షాల కారణంగా సంగీత దర్శకుడు గోపీసుందర్‌ రీ రికార్డింగ్‌ను పూర్తి చేయడంలో విఫలం అయ్యాడు. ప్రస్తుతం మారుతి కేరళలోనే రీ రికార్డింగ్‌ను చేయించే పనిలో ఉన్నాడు. అయితే వర్షాల కారణంగా సినిమాను వాయిదా వేయాల్సి వచ్చేలా ఉంది. శైలజ రెడ్డి అల్లుడు చిత్రం విడుదల పడే అవకాశం ఉండటంతో ఆ తర్వాత వారం రావాలనుకున్న పేపర్‌ బాయ్‌ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

silaja-reddy-paper-boy

దర్శకుడు సంపత్‌ నంది నిర్మాణంలో తెరకెక్కిన ‘పేపర్‌ బాయ్‌’ చిత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మరియు టీజర్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తున్నాయి. వచ్చే నెల 7న విడుదల చేయాలని భావించినప్పటికి శైలజ రెడ్డి అల్లుడు విడుదల ఆగిపోయే అవకాశం ఉన్న కారణంగా ఈనెల 31న విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. పేపర్‌ బాయ్‌ చిత్రంలో హీరోగా సంతోష్‌ శోభన్‌ నటించిన విషయం తెల్సిందే. దివంగత దర్శకుడు శోభన్‌ తనయుడు ఈ సంతోష్‌ శోభన్‌ అనే విషయం తెల్సిందే. సినీ వర్గాల వారితో పాటు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ చిత్రం ఒక వేళ శైలజ రెడ్డి అు్లడు వచ్చినా కూడా ఈనెల 31నే విడుదల చేయాలని భావిస్తున్నారు.

paper-boy-movie