బాహుబలిని టార్గెట్‌ చేసిన గోవిందం…!

Geetha-Govindham-To-Break-B

కేరళలో ప్రస్తుతం వర్షాలతో వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ ఎత్తున గీత గోవిందం కలెక్షన్స్‌ ముంచెత్తుతున్నాయి. ఒక చిన్న హీరో సినిమాకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ చిత్రం కలెక్షన్స్‌ నమోదు అవుతున్నాయి. కేవలం మొదటి అయిదు రోజుల్లో 32 కోట్ల షేర్‌ను దక్కించుకున్న ఈ చిత్రం తమిళనాడులో ఏకంగా బాహుబలి రికార్డుకు ఎసరు పెట్టింది. బాహుబలి తెలుగు వర్షన్‌ తమిళనాడులో దాదాపుగా కోటి రూపాయలను వసూళ్లు చేసింది. ఇప్పటికే నాన్‌ బాహుబలి రికార్డును దక్కించుకున్న గీత గోవిందం చిత్రం మరో మూడు నాలుగు రోజుల్లో బాహుబలి కలెక్షన్స్‌ను క్రాస్‌ చేసే అవకాశం కనిపిస్తుంది.

geetha-govindham

తెలుగు వర్షన్‌లో ఇప్పటి వరకు తమిళనాడులో బాహుబలి తప్ప మరే చిత్రం 60 లక్షలను క్రాస్‌ చేసింది లేదు. కాని గీత గోవిందం చిత్రం కేవలం మొదటి అయిదు రోజుల్లో ఏకంగా 70 లక్షలను వసూళ్లు చేసింది. మరో ముప్పయి లక్షలు సునాయాసంగానే సాధిస్తుందని అంతా నమ్ముతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన గీత గోవిందం చిత్రం భారీ వసూళ్లను రాబట్టడంలో ఆశ్చర్యం లేదు. కాని తమిళనాడులో తెలుగు వర్షన్‌కు ఈస్థాయిలో వసూళ్లు రావడం ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం సినిమా ప్రపంచంలో ఎక్కడెక్కడ రిలీజ్‌ అయ్యిందో అన్ని చోట్ల కూడా భారీగా వసూళ్లను నమోదు చేస్తుంది. బాహుబలి రికార్డులను ఇతర ఏ చిత్రాలు కూడా బ్రేక్‌ చేయలేక పోయాయి. కాని ఈ చిత్రం మాత్రం దుమ్ము దుమ్ముగా వసూళ్లు సాధిస్తుంది.

vijay-prabash