వరదల్లో చిక్కుకున్న హీరోయిన్‌.. కన్నీరు వాట్సప్‌ మెసేజ్‌

Ananya got stucked in Kerala flood

ప్రస్తుతం కేరళలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చిన్నా పెద్దా, సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వరద కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ఇల్లు కూడా వరద ప్రభావంకు లోను అయినట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. తాజాగా హీరోయిన్‌ అనన్య కూడా కేరళలో వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయినట్లుగా చెప్పుకొచ్చింది. వరదల్లో తన ఇల్లు పూర్తిగా మునిగి పోయిందని, ప్రస్తుతం తాను తన స్నేహితురాలి ఇంట్లో ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. కేరళలో ప్రస్తుత పరిస్థితికి అనన్య పడుతున్న ఇబ్బందులు నిదర్శనంగా చూడవచ్చు.

Ananya

తన ఇంటి సమీపంలో ఒక వీడియో అనన్య తీసి పోస్ట్‌ చేసింది. కన్నీరు పెట్టుకుంటు ఆమె చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సంచలనం రేపుతుంది. ఇంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఎంతో మంది సామాన్యులు పూర్తిగా కోల్పోయారు. జీవితంలో సంపాదించింధి అంతా కూడా నాశనం అయ్యిందని వారు వాపోతున్నారు. దాదాపుగా 410 మంది అధికారిక లెక్కల ప్రకారం చనిపోవడం జరిగింది. ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో వరద తగ్గుతుంది. ఈ సమయంలోనే సహాయక చర్యలు వేగవంగం చేస్తున్నారు.