రాకింగ్ రాకేష్ ఫస్ట్ మూవీ.. ఏకంగా కెసిఆర్ పాత్రలోనే..?

రాకింగ్ రాకేష్ ఫస్ట్ మూవీ.. ఏకంగా కెసిఆర్ పాత్రలోనే..?
Cinema News

జబర్దస్త్ షో ద్వారా చాలామంది వెలుగులోకి వచ్చారు. ఎంతోమంది లైఫ్ ని సెట్ చేసింది జబర్దస్త్. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని చాలామంది కమెడియన్లు ప్రస్తుతం మూవీ ల్లో రాణిస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు జబర్దస్త్ లో చేసిన వాళ్ళందరూ పెద్ద పొజిషన్ లోకి వచ్చారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన కమెడియన్లలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. త్వరలోనే హీరోగా ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు రాకేష్ .

రాకింగ్ రాకేష్ ఫస్ట్ మూవీ.. ఏకంగా కెసిఆర్ పాత్రలోనే..?
jabardasth Rakesh

ఆ సినిమా షూటింగ్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా రాకేష్ నటించబోతున్న చిత్రం గురించి ఒక అప్డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో ఇది తెగ షికార్లు కొడుతోంది. ఈ మూవీ కి కెసిఆర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కేసీఆర్ అంటే కేశవ చంద్ర రామావత్ ఈ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కటౌట్ ముందు ఒక పిల్లాడు నిలబడి కూడా ఉన్నాడు. ఆ పోస్టర్ని చూస్తున్నట్లయితే ఈ మూవీ తప్పకుండా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నే రాబోతున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ అనే టైటిల్ ని పెట్టడంతో అందరినీ బాగా ఆకర్షించింది రాకింగ్ రాకేష్  అనన్య ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా కనపడుతున్నారు.