ప‌రిటాల ర‌వి కూతురి నిశ్చితార్థం…

Paritala Ravi Daughter Sneha Latha Engagement

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప‌రిటాల ర‌వీంద్ర కుమార్తె స్నేహ‌ల‌త నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. అనంత‌పురం జిల్లా వెంక‌టాపురంలో కుటుంబ స‌భ్యులు, సన్నిహితులు, స‌మీప గ్రామాల నుంచి త‌ర‌లివ‌చ్చిన ప్ర‌జ‌ల మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. అంత‌కుముందు ప‌రిటాల ఘాట్ వ‌ద్ద కుటుంబ‌స‌భ్యులంతా నివాళుల‌ర్పించారు. స్నేహ‌ల‌త‌కు కాబోయే భ‌ర్త హర్ష మంచి బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. స్నేహ‌ల‌త ఎండీ పూర్తిచేశారు. హ‌ర్ష ప‌రిటాల ర‌వి సోద‌రి వ‌డ్ల‌మూడి శైల‌జ కుమారుడు. కూతురిని సోద‌రి కొడుకుకు ఇచ్చిచేయాల‌న్న‌ది ప‌రిటాల ర‌వి కోరిక‌. ఆయ‌న ఇష్టం ప్రకార‌మే ఈ వివాహం నిశ్చ‌యించారు. మే 6వ తేదీన వెంకటాపురంలో వివాహం జ‌ర‌గ‌నుంది. నిశ్చితార్థం వేడుక‌కు ఏపీ మంత్రి కాల్వ‌శ్రీనివాసుల‌తోపాటు ప‌లువురు నేత‌లు, అధికారులు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు.