రామ్ మాధవ్ తొలివ్యూహమే బెడిసికొట్టింది…

After Trouble With Allies Ram Madhav Hints At BJP Plan B

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ని పటిష్టం చేయాలంటే కాపులు తమ పార్టీని సొంతం చేసుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందుకోసం కొత్తగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన రామ్ మాధవ్ వేసిన తొలి ఎత్తే బెడిసికొట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబుని ఆ పదవి నుంచి తప్పించి అందులో ఓ కాపు నాయకుడిని కూర్చోబెట్టాలని బీజేపీ హైకమాండ్ ఆలోచన. దాన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు సర్కార్ మీద విరుచుకుపడ్డారు సోము వీర్రాజు , కన్నా లక్ష్మీనారాయణ. అయితే ఆ ఇద్దరు తన కన్నా ఎక్కువగా అధిష్టానంతో కలిసిపోతారన్న అభద్రతతో రామ్ మాధవ్ మాణిక్యాలరావు వైపు మొగ్గుజూపుతున్నారట. అయితే ఈ విషయం తెలిసిన సోము , కన్నా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్యాలరావు ని  అధికారికంగా ప్రకటిస్తే ఈ ఇద్దరూ పార్టీ నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. ఒకవేళ రామ్ మాధవ్ బుజ్జగింపులకి లొంగినా ఇంతకుముందులా పార్టీ కోసం పనిచేస్తారా అన్నది సందేహమే.

ఇక పార్టీని కాపులకి దగ్గర చేద్దాం అని రామ్ మాధవ్ వేస్తున్న ప్రణాళికకు కూడా విరుగుడు లేకపోలేదు.  ఏ చంద్రబాబుకి వ్యతిరేకంగా కాపులని దగ్గరకు తీసుకుందామని రామ్ మాధవ్ భావిస్తున్నారో ఆ వ్యూహంతోనే పెద్ద ఇబ్బంది వుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఆ సామాజిక వర్గం మీద కొంత ఉంటుంది. లోపాయికారీ రాజకీయాల మాట ఎలా ఉన్నప్పటికీ 2019 ఎన్నికల ముందు బీజేపీ తో జనసేన కలిసి పనిచేయడం ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో కష్టమే. ఇక కాపు రిజర్వేషన్స్ కి పచ్చ జెండా ఊపిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి దశ కోసం ఆ తీర్మానాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టిన విషయం తెలిసిందే. ఆ అంశాన్ని ప్రస్తావించి బీజేపీ ని ఇరుకున పడేయాలని టీడీపీ భావిస్తోంది. కాపు రేజర్వేషన్లకి కేంద్రం అనుమతి ఇస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు ఖాతాలో పడుతుంది , ఒకవేళ ఇవ్వకపోతే ఆ పాపం బీజేపీ ఖాతాలో పడుతుంది. ఇలా ఏ విధంగా చూసినా రామ్ మాధవ్ ఏపీ లో బీజేపీ కి గట్టి పునాది వేయడానికి తీసుకున్న తొలి నిర్ణయమే బెడిసికొట్టింది.