అమితాబ్‌ జీ.. ఇలా చేశారేంటి?

Amitabh Bachchan Special Look For Sye Raa Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్‌లో చిరంజీవి, నయనతారతో పాటు అమితాబచ్చన్‌ ఇంకా ప్రముఖ నటీనటులు పాల్గొంటున్నారు. సహజంగా స్టార్‌ హీరోల సినిమా లుక్‌ను ప్రతిష్టాత్మకంగా విడుదల చేయాలని దర్శకులు భావిస్తారు. అందరిలాగే దర్శకుడు సురేందర్‌ రెడ్డి సైరాలోని చిరంజీవి లుక్‌ను ఏదైనా ప్రత్యేకమైన రోజున విడుదల చేయాలని భావించాడు. కాని తాను చిరంజీవి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాను అంటూ అమితాబచ్చన్‌ సైరాలోని చిరు లుక్‌ను రివీల్‌ చేశాడు. చిరు లుక్‌ మాత్రమే కాకుండా ఒక సీన్‌కు సంబంధించిన స్టిల్‌నే బిగ్‌బి తన బ్లాక్‌లో పోస్ట్‌ చేశాడు.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం చిరంజీవి నరసింహారెడ్డి లుక్‌ వైరల్‌ అవుతుంది. అమితాబచ్చన్‌ ఈ లుక్‌ను రివీల్‌ చేసిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఏం అనలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొందరు మాత్రం కావాలని అమితాబ్‌ ద్వారా చిత్రం లుక్‌ను లీక్‌ చేయించారు అంటున్నారు. మొత్తానికి చిరంజీవి సైరా లుక్‌ అదిరి పోయిన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసుకుంటున్నారు. సైరాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘సైరా’ చిత్రం షూటింగ్‌ మూడవ షెడ్యూల్‌ మరి కొన్ని రోజులు జరుగనుంది. ప్రస్తుతం చిరు, నయన్‌ల పెళ్లి సీన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉయ్యాలవాడ గురువుగా అమితాబచ్చన్‌ కనిపించబోతున్నాడు. జగపతిబాబు, విజయ్‌ సేతపతి, సందీప్‌ ఇలా పలువురు స్టార్స్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.