సైరాలో అమితాబ్, చిరంజీవి, న‌య‌న‌తార గెట‌ప్ ఇదే..

Amitabh And Ciranjeevi And Nayanthara Gettap In Saira

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సైరా చిత్ర‌యూనిట్ కు షాక్ త‌గిలింది. సినిమాలోని అత్యంత కీల‌క‌స‌న్నివేశానికి సంబంధించిన ఓ ఫొటో లీక‌యింది. ఫొటోలో పాత‌కాలం నాటి మండ‌పం లాంటి ప్ర‌దేశంలో చిరంజీవి, న‌య‌న‌తార పీఠ‌ల‌పై కూర్చుని ఏదో యాగం చేస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ పీఠంపై కూర్చుని వెన‌క‌నుంచి చిరంజీవి, న‌య‌న‌తార వైపు చూస్తున్నాడు. ఆయ‌న‌కు కొంచెం వెన‌క‌గా బ్ర‌హ్మాజీ ఓ స్తంభానికి ఆనుకుని నిల్చునిఉన్నాడు. యాగం జ‌రుగుతున్న మండ‌పం చుట్టూ సామాన్య జ‌నం వేలాదిగా నిల్చుని ఉన్నారు.

చిరంజీవి వైట్, మెరూన్ కాంబినేష‌న్ డ్రెస్ లో పొడ‌వాటి జుట్టు, గ‌డ్డంతో క‌నిపిస్తుండ‌గా…న‌య‌న‌తార సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పసుపు చీర‌, చేతినిండా గాజులు, మెడ‌నిండా న‌గ‌లు, త‌ల‌పై బంగారు వ‌ర్ణం ముసుగుతో చిరంజీవి ప‌క్కన అణుకువ‌గా కూర్చుని ఉంది. అమితాబ్ రెండురోజుల క్రితం చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసిన గ‌డ్డంలుక్ లోనే క‌నిపిస్తున్నారు. ఈ ఫొటో ఎలా లీక‌యిందో గానీ…సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. పొటో త‌ర్వాత సైరా పై హైప్ మ‌రింత‌గా పెరిగింది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా తెర‌కెక్కుతోంది. లీక‌యిన ఫొటో చూస్తుంటే..స‌రిగ్గా అప్ప‌టి కాలం నాటి ప‌రిస్థితులు గుర్తుకువ‌స్తున్నాయి. మొత్తానికి ఫొటో బ‌య‌ట‌కు వ‌స్తే..వ‌చ్చిందికానీ…సినిమాకు మంచి ప్ర‌చారం ద‌క్కిన‌ట్ట‌యింది.