సైరా కోసం తమన్నా ప్రాణ త్యాగం?

tamanna role in sye raa movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే. మరో ముఖ్య పాత్రలో తమన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ విషయమై తమన్నా స్వయంగా క్లారిటీ ఇచ్చింది. తమన్నా ‘బాహుబలి’ చిత్రం తర్వాత నటించబోతున్న పెద్ద సినిమా ఇదే అవ్వడంతో అందరి దృష్టి ఆమెపై ఉంది. బాహుబలి తర్వాత తమన్నాకు పెద్దగా ఆఫర్లు రాలేదు. వచ్చిన చిన్నా చితక ఆఫర్లు కూడా సక్సెస్‌ను తెచ్చి పెట్టలేక పోయాయి. ఇలాంటి సమయంలో సైరాలో కీలక పాత్ర పోషించే అవకాశం రావడంతో తమన్నా వెంటనే సంతోషంగా ఓకే చెప్పింది.

ఇక ఈ చిత్రంలో తమన్నా పాత్ర గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తమన్నా ఈ చిత్రంలో వీర నారిగా కనిపించబోతుందని, నరసింహారెడ్డి సైన్యంలో తమన్నా కీలక వ్యక్తిగా కనిపించనున్నట్లుగా సమాచారం అందుతుంది. బ్రిటీష్‌ వారితో యుద్దంలో తమన్నా అద్బుతమైన ప్రతిభను కనబర్చి నరసింహారెడ్డి ప్రశంసలు దక్కించుకునే పాత్రలో కనిపించబోతుంది. ఇక ఈ చిత్రంలో తమన్నా పాత్ర నరసింహారెడ్డి ప్రాణాలను కాపాడేందుకు తను ప్రాణ త్యాగం చేస్తుందని, తన జీవితాన్ని స్వాతంత్య్ర పోరాటం కోసం, నరసింహారెడ్డి కోసం అంకితం చేస్తుందని తెలుస్తోంది. మొత్తానికి వీర నారిగా తమన్నా మరోసారి కనిపించి మెప్పించడం ఖాయం అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.