సైరా ప్రయాణం ఇప్పుడు అటు…!

Sye Raa Narasimha Reddy Team To Shoot Some Scenes In Mysore

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి ఈ చిత్రం ఇప్పటివరకు కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారట. ఓ భారీ యుద్ద సెట్ ను జార్జియా లో నిర్మించి షూట్ చేశారు. జార్జియా నుండి ఓ నెల రోజులక్రింద ఇండియా కు వచ్చిన చిత్ర బృందం తాజాగా హైదరబాద్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను. ప్రత్యేకించి వేసిన ఓ యుద్ద సెట్ లో క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం నుండి ఓ లేటెస్ట్ అప్డేట్ వేల్లువడింది. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చారిత్రాత్మక నగరం మైసూరు లో చిత్రీకరిస్తారు అని సమాచారం.

sye raa movie First schedule complete

ఇప్పుడు చిత్ర బృందం ప్రస్తతం ఆ ఏర్పాటులో ఉన్నట్టు సమాచారం. సైరా నరసింహా రెడ్డి చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, చిరంజీవికి గురువుగా నటిస్తున్నారు. అలాగే సౌత్ సినిమాకు సంబందించిన ప్రముఖ హీరోస్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, జగపతి బాబు, ఇలా ప్రముఖులు నటిస్తుండటంతో సినిమాపైన మంచి హైప్ తీసుకువస్తున్నారు. ఉవ్వలవాడ నరసింహ రెడ్డి పాత్రలో నటిస్తున్న చిరంజీవి, సరసన నయనతార నటిస్తున్నది. ఈ చిత్రాని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ పైన నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తుంది.