చిరంజీవిని కాపాడిన నిహారిక !

Niharika Konidela Role Revealed In Sye Raa Movie

మెగా హీరోయిన్ నిహారిక తన పెదనాన్న, మెగాస్టార్ చిరంజీవిని ఆపద నుంచి కాపాడనుందట. అదేంటి ఇప్పుడు ఆయనకు ఆపద ఏమి వచ్చింది నీహారిక కాపాడడానికి అనుకుంటున్నారా ? అది నిజంగా కాదండీ సినిమాలో. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో నిహారికకి ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఆమె బోయ అమ్మాయిగా ఈ సినిమాలో కనిపించనుంది.

ఈ బోయ అమ్మాయి ఓ సందర్భంలో ‘సైరా నరసింహారెడ్డి’ని ఆపద నుంచి కాపాడుతుందట. కేవలం రెండు సీన్స్‌లో మాత్రమె నిహారిక కనిపిస్తుందట. ఇటీవలే నిహారికకు సంబంధించిన షూటింగ్‌ ను కూడా చిత్రబృందం పూర్తి చేసిందని అంటున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.