నేను లైంగిక వేధింపుల భాదితురాలినే – మళయాళ నటి పార్వతి

malayalam actor parvathy

మళయాళ నటి పార్వతి దుల్కర్ సల్మాన్ తో నటించిన బెంగుళూరు డేస్, ధనుష్ తో నటించిన మరియన్ తో సౌత్ సినిమాకి సుపరిచితమే. మరియన్ సినిమా తెలుగులో విడుదల అయినా విజయవంతం కాకపోవడంతో తెలుగులో పార్వతి కి తగిన గుర్తింపు రాలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మీ టూ ప్రకంపనలు చెలరేగుతుండడంతో, పార్వతి కూడా తన గళం విప్పి, మళయాళ ఇండస్ట్రీలో తనకి జరుగుతున్న అన్యాయం గురించి, చిన్నతనంలో తనపై జరిగిన లైంగిక దాడి గురించి తెలిపింది.

నేను లైంగిక వేధింపుల భాదితురాలినే - మళయాళ నటి పార్వతి - Telugu Bullet

మళయాళ నటి భావన పై అత్యాచారం చేయించిన ఆరోపణలు ఎదుర్కొని, జైలుపాలైన మళయాళ నటుడు దిలీప్ కుమార్ విదుదలైన తరువాత మళయాళ సినీ సంఘం లో వెంటనే చేరడంతో, పార్వతితో పాటు, పలువురు మళయాళ నటీమణులు నిరసన వ్యక్తం చేశారు. దీనితో కక్ష కట్టిన దిలీప్ కుమార్ తనకు మలయాళంలో సినిమాలు రాకుండా ఇబ్బందులకు గురిచేశాడని,ఇప్పుడిప్పుడే తాను మళ్ళీ మళయాళ సినీ అవకాశాలు అందుకుంటున్నాని తెలిపింది. అంతేకాకుండా, తనకి మూడేళ్ళ వయసున్నప్పుడే తనపైన అత్యాచారం జరిగిందని, అది నా మనశ్శాంతి ని దూరం చేసే విషయం అని మీడియా ముందు వివరించింది.