షూటింగ్‌ అయితే పూర్తి.. మరి సినిమా ఎప్పుడు…?

Mr Majnu Censored With UA And No Cuts

అక్కినేని అఖిల్‌ ఒక్క సినిమా కూడా నటించకుండానే స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ స్టార్‌ ఇమేజ్‌ తో తన మొదటి సినిమా ‘అఖిల్‌’ చేశాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన అఖిల్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దాంతో తీవ్రంగా నిరాశ పడ్డ అఖిల్‌ రెండవ సినిమాను విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హలో అంటూ చేశాడు. ఆ సినిమా కూడా అదే విధంగా పోయింది. సరైన సమయంలో విడుదల చేయక పోవడం వల్ల హలో ఫ్లాప్‌ అయ్యిందని అక్కినేని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ప్రస్తుతం మిస్టర్‌ మజ్ను అంటూ తన మూడవ సినిమాను అఖిల్‌ సిద్దం చేస్తున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం విడుదలకు సరైన సమయం దొరకడం లేదు.

majnu-movie

ముందుగా మిస్టర్‌ మజ్ను చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించారు. అయితే డిసెంబర్‌ లో పలు సినిమాలు విడుదల ఉన్న కారణంగా రిపబ్లిక్‌ డే సందర్బంగా ఈచిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే రిపబ్లిక్‌ డే సందర్బంగా సినిమా అనుకుంటున్న ఈ సమయంలో ఎన్టీఆర్‌ రెండవ పార్ట్‌ ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ చిత్రం ను రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఒక వైపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న మిస్టర్‌ మజ్ను కు మరో వైపు విడుదల తేదీ సెట్‌ కాకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేమికుల రోజు సందర్బంగా ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పరీక్షల సీజన్‌ అవ్వడం వల్ల కలెక్షన్స్‌పై ప్రభావం ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

akhil-movie