తమిళంలో కన్నాడి అంటున్న సందీప్ కిషన్…!

Sundeep Kishan Acts In A Horror Film

వెంకటాద్రి ఎక్సప్రెస్ అంటూ సూపర్ స్పీడ్ తో సోలో హీరోగా హిట్ అందుకున్న సందీప్ కిషన్ తరువాత చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. ఎన్నో ఆశలు పెట్టుకొని కృష్ణ వంశీతో చేసిన నక్షత్రం కూడా దారుణ ఫలితం ఇవ్వడంతో, ప్రేమకథను నమ్ముకొని చేసిన మనసుకు నచ్చింది సినిమా తెలుగు ప్రేక్షకులకెవరికి నచ్చకపోవడంతో ఏమి చేయాలో పాలుపోక, తమిళంలోనే ఒక రెండు సినిమాలు చేస్తూ బిజీ అనిపించుకుంటున్నాడు. తమిళంలో సందీప్ కిషన్ కి మంచి పేరే ఉంది. తను తమిళంలో చేసిన మానగరం, మాయవన్ అనే సినిమాలు తమిళంలో సందీప్ కిషన్ కి కాస్త మంచి పేరునే తెచ్చిపెట్టాయి.

Sundeep-Kishan-movies

16 అనే క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకులని మాయ చేసిన కార్తీక్ నరేన్ అనే యువ దర్శకుడు తీస్తున్న నరగసూరన్ (తెలుగులో నరకాసురడు) లో మంచి పాత్ర చేస్తు్న్న, సందీప్ కిషన్ కన్నాడి అనే మరో తమిళ హారర్ చిత్రంలో నటిస్తున్నాడు.కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య సింగ్ అనే నూతన నటి హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా హారర్ నేపధ్యం లో ఒక కొత్త పాయింట్ తో వస్తుందని, ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు చెప్తున్నాడు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అవుతుంది.

Sundeep-Kishan