సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్న ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్న ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ‘పింక్’ రీమేక్ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ఈ సాయంత్రం 5 గంటలకు విడుదల అయింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ‘వకీల్ సాబ్’ టైటిల్ నే ఫిక్స్ చేశారు.

ఇక పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఫుల్ గడ్డంతో వెలికిలా పడుకుని చేతిలో బుక్ తో వెరీ స్టైలీష్ లుక్ లో కనిపించారు. అభిమానులు అంచనాలను ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందుకుని సినిమా పై ఆసక్తిని మరింతగా పెంచింది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.