వకీల్ సాబ్ షూటింగ్ కి అంతరాయం

వకీల్ సాబ్ షూటింగ్ కి అంతరాయం

పవన్ కళ్యాణ్ మాములుగా ఒక్క సినిమానే చేస్తాడు కానీ ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేసే అలవాటు లేదు. కానీ రెండేళ్లు రాజకీయాల్లో డబ్బులన్నీ హారతి కర్పూరం అయిపోవడం, ప్రస్తుతం తెలుగు సినిమా స్టార్లకి యాభై కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉండడంతో పవన్ ఒకేసారి రెండు సినిమాలు మొదలు పెట్టాడు.వకీల్ సాబ్ మొదలు పెట్టినపుడు పవన్ పక్కనే ఇంకో సినిమా మొదలు పెడతాడని దిల్ రాజు ఊహించలేదు.

నిజానికి వకీల్ సాబ్ కి సినిమా అంతటా గడ్డం ఉండాలని చెప్పారు. కానీ అది వేరే సినిమాకి ఆటంకం అవుతుందని పవన్ చెప్పాపెట్టకుండా గడ్డం తీసేసి ఇదే గెటప్ తో కోర్టుకి వస్తానని అన్నాడు. దిల్ రాజు దానికి కిక్కురుమనలేదు.అయితే పక్కన క్రిష్ సినిమా మొదలు పెట్టడం వల్ల వకీల్ సాబ్ షూటింగ్ కి అంతరాయం ఏర్పడుతోంది. వకీల్ సాబ్ కి పవన్ ఇచ్చిన డేట్స్ అన్నీకరోనా కబళిస్తోంది. షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు అనేసరికి క్రిష్ సినిమా అడ్డం పడుతుంది. దీంతో దిల్ రాజు తలా పట్టుకున్నాడు.