ప్రశ్నార్థకంగా మారిన స్థానిక ఎన్నికలు

ప్రశ్నార్థకంగా మారిన స్థానిక ఎన్నికలు

భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ రెండో స్టేజ్‌కు చేరింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు.. పలు ప్రభుత్వాలు.. కరోనా వైరస్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూండటం వంటి కారణాలతో భారత్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఆరు వారాల తర్వాత ఎన్నికలు జరుగుతాయా.. లేదా అన్నది ఇప్పుడే అంచనా వేయడం కష్టం… ఎన్నికల కోడ్‌ను మాత్రం సుప్రీంకోర్టు ఎత్తి వేసింది. కొత్త పథకాలు ఏవీ ప్రవేశపెట్టవద్దని .. పాత పథకాలు కొనసాగించుకోవచ్చని సూచించింది.

పరిస్థితి అంతా సద్దుమణిగి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. ఓ సారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరవాత మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడం అంటే.. ప్రక్రియ మొత్తం కొత్తగా ప్రారంభించినట్లేనన్న వాదన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే.. ప్రస్తుతం ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసింది. ఆ ఆర్డినెన్స్ ప్రకారం.. ఇరవై రోజులకు అటూ ఇటూగా అన్ని రకాల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. కానీ.. ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. అనూహ్య కారణాలతో వాయిదా పడ్డాయి. దీంతో.. ఆ ఆర్డినెన్స్ ప్రకారం చూసినా… ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారినట్లేనన్న అంచనాలున్నాయి.